శ్మశానవాటిక రహదారిపై డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

శేరిలింగంప‌ల్లి, జూన్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నల్లగండ్ల డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి వీకర్ సెక్షన్ కాలనీలో శ్మశానవాటికకు వెళ్లే రహదారిపై నెలకొన్న డ్రైనేజీ సమస్యపై సమాచారం అందుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాగం హరి శంకర్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు శంకరి రాజు ముదిరాజ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్య తీవ్రతను తెలుసుకున్న అనంతరం, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (HMWSSB) మేనేజర్‌కు ఫోన్ చేసి డ్రైనేజీ సమస్యపై వివరించారు. వారి చొరవతో డ్రైనేజీ క్లీనింగ్ కోసం జెట్టింగ్ మెషిన్‌ను అక్కడికి రప్పించి, పనులు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. డ్రైనేజీ సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవడంతో స్థానికులకు ఉపశమనం కలిగింది.

ఈ సందర్భంగా కాలనీవాసులు స్పందిస్తూ, తమ సమస్యను వెంటనే గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కారం చూపించిన రాగం హరి శంకర్ యాదవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, సంధ్య, మూర్తి, మల్లేష్, పాస్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here