డ్వాక్రా మహిళలకు ఉచిత చీరల పంపిణీ.. మదీనగూడలో కార్యక్రమం..

శేరిలింగంప‌ల్లి, జూన్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమ పథకాలలో భాగంగా మదీనాగూడ డివిజన్ పరిధిలోని డ్వాక్రా పొదుపు సంఘాల మహిళా సభ్యులకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హఫీజ్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ హాజరై మహిళా లబ్ధిదారులకు స్వయంగా చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి మహిళకు చేరేలా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పీ ఆశతోపాటు కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి, యాదగిరి, సుదీష్, రాజు, భగత్, శ్రవణ్, వీరేందర్, గోపి, శిరీష, రవళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here