శేరిలింగంపల్లి, మే 5 (నమస్తే శేరిలింగంపల్లి): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని డైమండ్ హిల్స్‌లో నివాసం ఉంటున్న షాహజాద్ ఖాన్ (28) స్థానికంగా ఓ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన రాత్రి 11:30 గంటల సమయంలో రాయదుర్గంలోని మై హోం ట్విట్జా బిల్డింగ్ సమీపంలో లక్స్ హాస్పిటల్స్ నుండి స్కైవ్యూ బిల్డింగ్ వైపు అతను రోడ్డు దాటుతుండగా ఐకియా నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం షాహజాద్ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






