శేరిలింగంపల్లి, మే 5 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు, నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయినాక మూడోసారి మన పదో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు నాలుగు గంటలకు రాష్ట్రానికి రాబోతున్నారు వారికి ఘన స్వాగతం పలకవలసిందిగా BJP రాష్ట్ర నాయకులు నీరటి చంద్రమోహన్ ప్రజలను కార్యకర్తలు విజయవంతం చేయవలసిందిగా నేను కోరారు. ఆ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గోడ రాత రాసి ప్రజలకు చెప్పడం జరిగింది. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రానికి ఎన్నికల వచ్చినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తున్నదని, నేడు పశ్చిమ బెంగాల్ ప్రజలకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుంభకోణాల పార్టీగా ఉండేదని అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని, హామీలు గ్యారంటీలు పథకాలతో కాలయాపన చేసారే తప్ప ప్రజలకు ఏమి ఊరగా కలిగించలేదని లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా ఆయన సభకు భారీ ఎత్తున ప్రజలు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, గణేష్, లక్ష్మణ్, రఘు తదితరులు పాల్గొనడం జరిగింది.






