శివాజీ నగర్‌లో కట్టమైసమ్మ అమ్మవారి 12వ వార్షికోత్సవం

శేరిలింంగంప‌ల్లి, జూలై 8 (న‌మ‌స్తే శేరిలింంగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ కాలనీలో సీనియర్ నాయకుడు ఉరిటి వెంకట్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి దేవస్థానం 12వ వార్షికోత్సవ వేడుకల‌ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, ప్రజల సుఖశాంతి కోసం ప్రార్థనలు చేసిన ఆరెకపూడి గాంధీ, ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వసుంధర, ఉరిటి వెంకట్‌రావు, మాజీ కౌన్సిలర్లు రవీందర్‌రావు, వీరేశం గౌడ్, నాయకులు మిరియాల రాఘవరావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రవీణ్‌తోపాటు భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here