శేరిలింగంపల్లి, మే 5 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్‌లో మే 10న నిర్వహించనున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్స్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో హఫీజ్ పేట్ డివిజన్ ఇంజనీర్ ఎంక్లేవ్ లో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ గౌడ్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మే 10న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. హఫీజ్ పేట్, మదీనాగూడ డివిజన్ నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు మహేష్ యాదవ్ , మాజీ కౌన్సిలర్ రమణయ్య , బీజేపీ జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్ , బీజేపీ డివిజన్ మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రావు , బీజేపీ నాయకులు సత్యనారాయణ రాజు , పవన్ , శ్రీశైలం కురుమ , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు , ప్రసాద్ పాత్రో , డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్ , కార్యదర్శి సుబ్బారావు, ఓబీసీ మోర్చా డివిజన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ , ఓబీసీ మోర్చా డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ , బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ , బీజేవైఎం డివిజన్ ప్రధాన కార్యదర్శి బాలరాజు , బీజేపీ నాయకులు రాంరెడ్డి , అశోక్ ముదిరాజ్ , శేఖర్ ముదిరాజ్ , అశోక్ , రవి ముదిరాజ్ , మనోజ్ యాదవ్ , సలీం , రామారావు , యువ మోర్చా, ఓబీసీ మోర్చా నాయకులు, ఇతర మోర్చాల నాయకులు పాల్గొన్నారు.





