మియాపూర్ సర్కిల్‌లో జోనల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

శేరిలింంగంప‌ల్లి, జూలై 8 (న‌మ‌స్తే శేరిలింంగంప‌ల్లి): మియాపూర్ సర్కిల్ పరిధిలో జోనల్ కమిషనర్ (ZC) నారాయ‌ణ్ అమిత్‌ సంబంధిత అధికారులతో కలిసి బుధవారం విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ (DC) జి.శ్రీ‌నివాస్‌, ఇంజినీరింగ్ మెయింటెనెన్స్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (DEE), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియంలో ఇండోర్ షటిల్ కోర్టు, జిమ్, టేబుల్ టెన్నిస్ కోర్టు, బాక్సింగ్ కోర్టును పరిశీలించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను సమీక్షించారు.

అనంతరం చందానగర్ ఇందిరానగర్‌లో అభివృద్ధి చేస్తున్న వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ పనులను పరిశీలించి పురోగతిని తెలుసుకున్నారు. అలాగే హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న స్పోర్ట్స్ అరేనాను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేస్తూ, కొనసాగుతున్న అన్ని అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here