శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులకు గురవకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ తెలిపారు. మియాపూర్ బస్ స్టాప్ వద్ద జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు సీసీ రోడ్డును నిర్మించారని తెలిపారు. ఇందుకు గాను పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు తీవ్రంగా శ్రమించారని తెలిపారు. ఈ రోడ్డు వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, వాహనదారులు సులభంగా రాకపోకలు సాగించవచ్చని అన్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.






