అంగన్వాడీ సమస్యలపై దొంతి శేఖర్ ముదిరాజ్ ఆరా

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గంగారం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న మౌలిక వసతుల లోటుపై స్థానిక నేతలు సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొంతి శేఖర్ ముదిరాజ్, హెడ్ మాస్టర్ సుభాష్‌తో పాటు ఉపాధ్యాయ బృందంతో సమావేశమై తరగతి గదుల కొరత, తాగునీటి సమస్య, మరుగుదొడ్ల నిర్వహణ లోపాలు, ఫర్నిచర్ అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన వసతులు సమకూర్చే దిశగా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత, భవనాల దుస్థితి, పోషకాహార సరఫరా సమస్యలపై కూడా దొంతి శేఖర్ ముదిరాజ్ ప్రత్యేకంగా ఆరా తీశారు. చిన్నారుల ఆరోగ్యం, విద్యపై ప్రభావం పడకుండా తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ భీమమ్మ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కేవలం ప్రకటనలకే పరిమితం కాక అమలులోనూ కనిపించాలన్నది స్థానికుల అభిప్రాయం.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here