- బాగ్ అమీర్‌లో బీజేపీ అభ్యర్థి ఉప్పల విద్యాకల్పన ఏకాంత్ గౌడ్ ప్రచారం
వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానందనగర్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉప్పల విద్యాకల్పన ఏకాంత్ గౌడ్‌కు డివిజన్ జనసేన నాయకుడు సమ్మెట ఎస్‌వీ బాబు మద్దతు పలికారు. ఈ మేరకు ఆయన మంగళవారం డివిజన్ బీజేపీ నాయకుడు ఉప్పల ఏకాంతగౌడ్‌ను కలిశారు. అనంతరం సమ్మెట ఎస్‌వీ బాబు మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు పలికారన్నారు. అందుకనే స్థానిక బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉప్పల విద్యాకల్పన ఏకాంత్ గౌడ్ కు మద్దతు తెలుపుతున్నారన్నారు. డివిజన్‌లో పవన్ కల్యాన్ అభిమానులు బీజేపీకి ఓటు వేయాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
బాగ్ అమీర్‌లో ఉప్పల విద్యాకల్పన ఏకాంత్ గౌడ్ ప్రచారం…
వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్‌లో డివిజన్ బీజేపీ అభ్యర్థి ఉప్పల విద్యాకల్పన ఏకాంత్ గౌడ్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాలనీవాసులు అందరూ తమకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. కాలనీలో ఉన్న సమస్యలపై బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు పోరాటం చేశారని, అందుకనే వారి పార్టీని గెలిపించుకుంటామని కాలనీవాసులు తెలుపుతున్నారని అన్నారు. బీజేపీకి ఓటు వేస్తామని జనాలు చెబుతున్నారని పేర్కొన్నారు.