టీఆర్‌ఎస్‌ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ తారానగర్ కి చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, తెరాస పార్టీ నాయకుడు నటరాజ్ ల‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. వారికి గాంధీ తెరాస కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ… టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కృషితోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని, పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలోనే హైదరాబాద్ ఎంత‌గానో అభివృద్ధి చెందింద‌ని అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గుప్తా, సంపత్ గుప్తా, మహేష్ గుప్తా, గోవర్ధన్ గుప్తా, రవిచంద్ర గుప్తా, సంగమేష్, నర్సింగ్, జనార్దన్, యాదగిరి, వెంకటేష్ పాల్గొన్నారు.

తెరాస‌లో చేరిన వారికి పార్టీ కండువాల‌ను క‌ప్పుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
పార్టీలో చేరిన వారితో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here