హైదర్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ తెరాస అభ్యర్థి నార్నె శ్రీనివాసరావుకు మద్దతుగా జీహెచ్ఎంసీ మహిళా కార్మికులు గేయాలు ఆలపిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కుమారుడు పృథ్వి గాంధీ వారిని కలసి అభినందలు తెలియజేశారు. అనంతరం వారితో కలసి కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదర్ నగర్ డివిజన్ తెరాస అభ్యర్థి నార్నె శ్రీనివాసరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.