శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): హనుమాన్ జయంతి పర్వదినంను పురస్కరించుకుని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్ లో ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి , శ్రీ సాయి బాబా దేవాలయంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకలలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో, ఎక్కడ శ్రీరామ నామం వినిపిస్తుందో.. అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఆయనను మించిన భక్తుడు లేడంటూ శ్రీ రామచంద్రుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశాలి హనుమంతుడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేనీ చంద్రకాంత్ రావు, ఏకాంత్ గౌడ్ ,విధ్యకల్పన గౌడ్, అల్లం మహేష్, పరమేష్ ,నరేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.