శేరిలింగంపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని శిల్పా ఎన్ క్లేవ్‌లో ఉన్న శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో ఆలయ 8వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్బంగా స్వామి వారికి అష్టోత్తర శత కలశాభిషేకం, చతురావృత్తి తర్పణాలు, యంత్రార్చన, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్న సమారాధనలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని పురవీధుల్లో రథంపై ఊరేగించారు. అలాగే ప్రసాద వితరణ గావించారు. ఈ ఉత్సవాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.