శేరిలింగంపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు పారునంది శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈనెల 27న వరంగల్ లో జరిగే భారీ బహిరంగ సభకు చందానగర్ డివిజన్ నుండి వందల సంఖ్యలో బయలుదేరబోతున్నామని వాల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాలా హరీష్ రావు హాజరయ్యారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండీ సలీం, దొంతి చిన్న, ఎండీ అప్సర్, మల్లేష్ యాదవ్, గిరి, ఉపేందర్, ముజాహిద్ ఖాన్ పాల్గొన్నారు.