శేరిలింగంపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ బటాలియన్ పాఠశాలలో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి వెంకటయ్య, శేరీలింగంపల్లి డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రక్తపు జంగం గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధిలో ముందుకు సాగాలని జంగం గౌడ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.