శేరిలింగంపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మియాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్, జితేందర్ ఆధ్వర్యంలో మియాపూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ బిజెపి నాయకులు చేతికి నల్ల రిబ్బన్స్ కట్టుకొని జాతీయ జెండా పట్టుకొని పాకిస్తాన్ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.కాల్పుల్లో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.