శేరిలింగంపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): అమాయకమైన టూరిస్టులపై కాల్పులు జరపడం పిరికిపందల చర్య అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ అన్నారు. పాకిస్తాన్ కి దమ్ముంటే యుద్ధానికి రావాలి గాని వెనుక నుంచి కాల్పులు చేయడం సరికాదన్నారు. టెర్రరిస్టులను పాకిస్థాన్ పెంచి పోషిస్తుందని, భారత్‌పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్ త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.