శేరిలింగంపల్లి, ఏప్రిల్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): దేశంలో నూతనంగా అమలు చేయనున్న విద్యావిధానంపై పరిశోధనకు గాను కొండాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలను పలువురు విద్యావేత్తలు, మేధావులు, రాజకీయ నాయకులు సందర్శించారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సార్, బ్రెజిల్ దేశపు ఎంపీ, విద్యా సలహాదారు లుసియానా, సీజర్, మండల విద్యాధికారి వెంకటయ్య, జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణా రెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ప్రధానోపాధ్యాయుడు పల్లె అనంత రెడ్డి, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్, మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, MRC సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, CRP భాగ్య, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.