శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ లో ఉన్న సాయి ఐశ్వర్య కాలనీలోని శ్రీ సాయి బాబా ఆలయ 9వ వార్షికోత్సవం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు ప్రత్యేక అర్చనలు నిర్వహించి స్వామి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలపై స్వామి వారి చల్లని చూపు ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని వేడుకున్నానని తెలిపారు. ఆలయాలు మానసిక ప్రశాంతతకు ఎంతగానో దోహదపడతాయని, గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తానని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. భక్తిశ్రద్ధలతో స్వామి వారి వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నందుకు ఆలయ కమిటీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమం లో సాయిబాబా ఆలయ ఆలయ కమిటీ సభ్యులు రామ్ రెడ్డి, అశోక్ రాజు, రమణి, సీనియర్ నాయకులు సుమన్, అరుణ్ గౌడ్, స్థానిక నేతలు, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, సాయి ఐశ్వర్య కాలనీ వాసులు, పిల్లలు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.