శేరిలింగంపల్లి, అక్టోబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్ వరకు, భారత్ పెట్రోల్ పంపు నుండి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వరకు రూ.2.62 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు విస్తరణ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ శర్మ, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.