ప్ర‌భుత్వ భూముల‌ను ప‌రిర‌క్షించాలి.. PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ..

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ‌లో ఉన్న‌ సర్వే నెంబర్ 149లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని జీఓ నెంబర్ 59ను దుర్వినియోగం చేస్తూ రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, ఖాజాగూడ‌లోని సర్వే నంబర్ 27 లో ని ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని, సున్నం చెరువును మట్టితో పూడ్చి అక్రమ లే ఔట్ వేసిన భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మియాపూర్ నుండి పటాన్ చెరు వ‌రకు నాగపూర్ నమూనా ప్రకారం డబుల్ డెక్కర్ ప్లై ఓవర్ మెట్రో మార్గం, ఫ్లై ఓవర్ ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ‌లో ఉన్న‌ సర్వే నెంబర్ 149లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని జీఓ నెంబర్ 59ను దుర్వినియోగం చేస్తూ ఒక్కొక్క‌రికి వేలాది గజాల స్థలాన్ని రాసిచ్చేశారని, జీఓ 59ను దుర్వినియోగం చేసిన అధికారులు, ప్రధాన సూత్రధారి పి. సురేందర్ అతని కుటుంబ సభ్యులు బినామిల పేర్ల మీదుగా వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నాడ‌ని , చేసుకున్న కొన్ని గంటలలోనే కొన్ని నిర్మాణము సంస్థలకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింద‌ని, 59 G.O కు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేసుకోవడం జరిగింద‌ని, ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఈ తతంగం అంతా నడిపించార‌ని , డాక్యుమెంట్లను, అన్ని ఆధారాలను సమర్పించడం జరిగింద‌ని అన్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా 59 G.O కు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేసిన స్థలాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు.

ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న కోట్లాది రూపాయల వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జాలు చేసి జీఓ 59 కింద రెగ్యులరైజ్ చేశారని, కనీసం స్థల పరిశీలన కూడా లేకుండానే రెవెన్యూ అధికారులు కన్వినియెన్స్ డీడ్ చేశారని అన్నారు. జీఓ 59 నిబంధనల‌ను తుంగలో తొక్కి రాత్రి సమయంలో రెవెన్యూ అధికారులు ఒక్కొక్కరికి వేల గజాల స్థలం రెగ్యులరైజ్ చేశారని, డీడ్ చేసుకున్న వ్యక్తి అదే రోజు రాత్రికి రాత్రే అమ్మేసుకున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయల స్థలం చేతులు మారడంలో అధికారులు, కొందరు ప్రజా ప్రతినిధుల పాత్ర ఉందని PAC చైర్మన్ గాంధీ తెలిపారు. ఖాజాగూడలోని సర్వే నంబర్ 27 లోని ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని, అక్రమార్కులు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేద‌ని, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అన్నారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలోని సున్నం చెరువును ఎకరాల కొద్దీ మట్టి పూడ్చి యథేచ్ఛగా కబ్జా చేసి అక్రమ లే ఔట్ లు వేసి కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి సహకరించిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని, ఫెన్సింగ్ తొలగించి కబ్జాలకు పాల్పడ్డార‌ని, గతంలో అనేక ఫిర్యాదులు చేసినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేద‌ని, ఇరిగేషన్ అధికారుల అలసత్వం వలన చెరువు కబ్జాకు గురి అయింద‌ని, తిరిగి చెరువుకు పూర్వ వైభవం వచ్చేలా యథాస్థితికి తీసుకువచ్చి చెరువును సంరక్షించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ భూముల‌ను, చెరువులను సంరక్షిస్తామని, డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ మెట్రో మార్గం నిర్మాణంను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here