మాదాపూర్, అక్టోబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు ఆధ్వర్యంలో యాప్రాల్ నుండి నూపుర డాన్స్ అకాడమీ గురువు సరిత ప్రవీణ, ఆమె శిష్యులు మీనాక్షి ప్రవీణ్, శ్యామశ్రీ, జి. యశస్విని, నాగ వైష్ణవి, సంగీత, ప్రగతి, శ్రీక, వై.యశస్విని, శ్రీ మహేశ్వరి, శ్రీ లక్ష్మి, శనయ, ధన్య, పూర్వి, శ్రీనిక, సంగీని, అనన్య శ్రీ సంయుక్తంగా భరతనాట్యం ప్రదర్శించారు. శ్రీ గణేశ శరణం, పుష్పాంజలి, తిల్లై కౌత్వం, ముద్దుగారె యశోద, అష్టలక్ష్మి, శ్రీమన్నారాయణ, అలైపాయుదే, చిన్న కన్నన్, అదివో అల్లదివో, భాగ్యద లక్ష్మి, తిల్లాన అనే కీర్తనలకు నృత్యాభినయం అందించారు. అనంతరం కళాకారులకు, ముఖ్య అతిథికి అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ ఙ్ఞాపికను అందించారు. చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే హారతులతో, పసందైన ప్రసాద నైవేద్యాలతో కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు.