శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వర్ణ కిరీటం బహుకరణ 

  • ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ 

నమస్తే శేరిలింగంపల్లి: చందా నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారికి కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కుటుంబ సమేతంగా(సతీమణి శ్యామల దేవి, కుమారుడు పృథ్వి గాంధీ.) స్వర్ణ కిరీటం ను బహుకరించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారికి సమర్పించేందుకు స్వర్ణ కీరిటంతో వెళ్తున్న ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ, ఆయన కుటుంబ సభ్యులు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వర్ణ కిరీటంను తమ కుటుంబ సభ్యుల మధ్య బహుకరించడం చాలా సంతోషంగా ఉందని, స్వామి వారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

స్వర్ణ కీరిటం సమర్పిస్తూ..

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ , సందీప్ రెడ్డి, నరేందర్ బల్లా, యశవంత్ , వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయ కమిటీ సభ్యులు సుభాష్ , రాంగోపాల్, సుబ్బారాయుడు, అశోక్, కుమార్, గుప్తా, నాగేశ్వరరావు, శ్రీకాంత్, భక్తులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గాంధీ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సత్కారం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here