- ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో చలో గన్ పార్క్
- భారీగా తరలిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు
నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ సాధనలో అమరులైన అమరవీరులను స్మరించుకోవడం మన బాధ్యత అని, వారి త్యాగాలను స్మరించుకోవాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్ద గల అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్ల రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, జూపల్లి సత్యనారాయణ, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగరావు, మాజీ కార్పొరేటర్లు సాయి బాబా, మాధవరం రంగరావు , బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ భారీ ర్యాలీగా బయలుదేరి అమర వీరులకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ తెలంగాణ ప్రజలకు, బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు *(జూన్ 2 న)* తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.