- హైటెక్ సిటీ అభివృద్ధికి చంద్రబాబు కృషి.. చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుంది
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ
నమస్తే శేరిలింగంపల్లి: హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలలో భాగంగా గచ్చిబౌలి జి.యం.సి బాలయోగి స్టేడియంలో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించిన హైటెక్ సిటీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలుగుజాతి అభివృద్ధికి నిరంతరం కృషి చేసి, హైదరాబాద్ ను ప్రపంచంలోనే గర్వించదగ్గ విశ్వనగరంగా తీర్చిదిద్దిన చంద్రబాబుకి సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు, డిఎస్ఆర్ కే ప్రసాద్, లీలా ప్రసాద్, గిరి, సత్యనారాయణ, కిలారి ప్రసాద్, సాంబయ్య ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.