- సభ్యత్వంతో పాటు అన్ని పదవులు వదులుకున్న జిల్లా మహిళ మోర్చా సెక్రటరీ విద్యాా కల్పన
- ఆమే బాటలో మరికొంతమంది పయనం
నమస్తే శేరిలింగంపల్లి: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బిజెపి పార్టీకి, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని వివేకానంద నగర్ డివిజన్ బీజేపీ కాంటెస్టెంట్ కార్పొరేటర్, జిల్లా మహిళ మోర్చా సెక్రటరీ తెలిపారు.
మరికొంతమంది ఆమెను అనుసరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ డివిజన్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, వ్యక్తిగత, అభిమానుల సూచనలు, సలహాల మేరకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, అందరి ఒత్తిడికి తలొగ్గక తప్పని పరిస్థితిలో బీజేపీ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవులు వదులుకున్నామని చెప్పారు.
తనతోపాటు రాజీనామా చేసిన వారిలో రాష్ట్ర ఓబీసీ నాయకులు ఏకాంత్ గౌడ్, నియోజకవర్గం నాయకులు భానుయాదవ్, ఎస్సీ మోర్చా సెక్రటరీ నాయకులు అశోక్, జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు గణేష్ గౌడ్, డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు రమేష్, దయాకర్ రెడ్డి డివిజన్ కార్యదర్శి, జితేంద్ర డివిజన్ కార్యదర్శి, డివిజన్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, డివిజన్ ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు మార్ల శీను, డివిజన్ మహిళా మోర్చా ఉపాధ్యక్షులు ఉపేంద్ర, శృతి గౌడ్, సెక్రటరీ భారతి, శాలిని, డివిజన్ స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.