- విద్యుత్ సౌకర్యం కల్పించాలని బొబ్బ నవత రెడ్డి డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ శివాజీ నగర్ అంగన్ వాడి బడిలో నాలుగు నెలలుగా నుండి కరెంట్ లేక చిన్నారులు అవస్థలు పడుతున్నారని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి తెలిపారు.
ఈ సమస్యను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ , ఎమ్మెల్యే గాంధీకి అనేక సార్లు చెప్పిన వారు పట్టించుకోవడం లేదన్నారు. స్కూల్లో పిల్లలకు ఫ్యాన్, లైట్లు లేక ఈగలు, దోమలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే శివాజీ నగర్ అంగన్వాడీ స్కూల్ కి విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రాంతి, గౌస్, అనంత రెడ్డి ఉన్నారు.