శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం తప్పితే ఎవరు బయటకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశరయ్య కాలనీ, సాయి నగర్ కాలనీలలో ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, పలు శాఖల సంబంధిత అధికారులతో కలసి పర్యటించి, పరిశీలించి, సహాయక చర్యల్లో ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజలు వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దు అని తెలిపారు. ప్రతి ఒక్కరు కనీస స్వీయ రక్షణ చర్యలు పాటించాలని పిలుపునిచ్చారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎప్పటికప్పుడు అవసరం అయిన చోట సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు సందీప్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






