శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): చందా నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామిని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిలతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారి ఆశీస్సులను పొందారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి , మిరియాల రాఘవ రావు, సుభాష్, సుప్రజ ప్రవీణ్, ఉరిటీ వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు.






