విద్యార్థులకు బస్ పాస్ లు పంపిణి

  • బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ కు స్కూల్ సమస్యలు వివరించిన ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ
  • పరిష్కరిస్తానని హామీ

నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో బండి రమేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు బస్సు పాసులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, మియాపూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్రావు , ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ పాల్గొన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ స్కూల్లో నెలకొన్న సమస్యలను బండి రమేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఫ్యాన్లు, ట్యూబ్ లైట్, తాగునీటి సమస్యలను వివరించారు.

దీనిపై బండి రమేష్ స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం కేజీ టు పీజీ విద్య, ఐటి అన్ని రంగాలను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. తెలంగాణలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని, అవి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ లేదా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), ICSE, IB, IGCSEకి అనుబంధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రసాద్, మురళీధర్, భాస్కర్, రవీందర్, యాదగిరి ఆర్గనైజ్ చేశారు. కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, నర్సింగ్ రావు, తెప్ప బాలరాజు ముదిరాజ్, కాకర్ల అరుణ, సలీం, రవీందర్, సత్యారెడ్డి , అంజద్ అమ్ము , సిల్వర్ మనీష్ , మునాఫ్, బిఆర్ యువసేన పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here