రేవంత్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ.. తీవ్ర నిరసన

  • ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనం

నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్‌ పార్టీని, రేవంత్‌ను తమ పొలిమేరల్లోకి కూడా రానివ్వబోమని తెగేసి చెప్తున్నారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు 3 గంటల ఉచిత విద్యుత్తు చాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు.. ఆల్విన్ X రోడ్డు వద్ద కార్పొరేటర్లు హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సాయి బాబా, మాధవరం రంగరావు తో కలిసి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ‌లో రైతుల‌కు సీఎం కేసీఆర్ అండ‌గా నిలిస్తే, కాంగ్రెస్ మాత్రం రైతుల పొట్టకొట్టేందుకు చూస్తుంద‌ని మండిప‌డ్డారు. ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యల‌ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నద‌ని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు స్వయంగా అనుభవించారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు శాశ్వతంగా దూరం చేశామని స్పష్టం చేశారు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ ను ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికే అన్నం పెట్టే రైతన్నలకు అన్యాయం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రైతులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
‘రైతులకు మూడే గంటలు కరెంటు చాలన్న కాంగ్రెస్‌ పార్టీ, ఖబడ్దార్‌ రేవంత్‌రెడ్డి’ అని తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.


సీఎం కేసీఆర్ నినాదం ” మూడు పంటలు ” కాంగ్రెస్ విధానం ” మూడు గంటలు ” బిజెపి బిజెపి విధానం “మతం పేరిట మంటలు” వీటిలో ఏది కావాలో.. తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here