- సీజనల్ ఫ్రూట్స్ పేరుతో అమ్మకాలు
- ఐస్ క్రీమ్, ఇతర మీట్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్
- శేరిలింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్ అమీషా ఫుడ్ మేకింగ్ పై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు
- స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి..
- యాజమాన్యంపై కేసులు నమోదు, అరెస్ట్
- భారీ ఎత్తున ఇథనాల్, స్పిరిట్, కెమికల్స్ సీజ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్ అమీషా ఫుడ్ మేకింగ్ పై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు నిర్వహించి ఆ కంపెనీని సీజ్ చేశారు. వివరాలు స్థానికంగా ఓ షెటర్ లో సీజనల్ ఫ్రూట్స్ పేరుతో అమ్మకాలు, గుట్టుచప్పుడు కాకుండా డ్రమ్ముల కొద్ది ఇథనాల్, ఫోర్క్ మీట్, ఐస్ క్రీమ్స్ తదితర ఫుడ్ ప్రోడక్ట్స్ తయారీ చేస్తున్నారు. అవి కుళ్లిపోకుండా ఉండేందుకు ఇథనాల్, ఇతర కెమికల్స్ వాడుతున్నారు. ఇలా తయారు చేసిన ప్రోడక్ట్స్ ను మన దేశంతో పాటు, శ్రీలంక, జాంబియా, ఆస్ట్రేలియా దేశాలకు సరఫరా చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఏఎంహెచ్ ఓ డాక్టర్ నగేష్ నాయక్, వెటర్నరీ డాక్టర్.. అబ్దుల్ వాసీద్.. నేతృత్వంలో అధికారులు రంగంలోకి దిగి నగరంలో దందా నిర్వహిస్తున్న యూపీకి చెందిన అమీషా ఫుడ్స్ యజమానిని అరెస్ట్ చేశారు. వ్యాక్యూమ్ ప్యాక్ లు లేకుండా, కనీస ప్రమాణాలు పాటించకుండా తయారీ చేపడుతున్న ఆ కంపెనీని సీజ్ చేశారు.