నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చి బౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ లోని ప్రశాంతి హిల్స్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
పర్యటించారు. అక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు తమ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న అంతర్గత సీసీ రోడ్డు వెడల్పు సైజు పెంచాలని, భూగర్భ డ్రైనేజీ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీ వాసులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని కోరారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొని రావాలని ప్రజలను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రశాంతి హిల్స్ కాలనీ నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు ఆర్ వెంకటేష్, గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర, సీనియర్ నయకురాలు వరలక్ష్మి, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్, ప్రశాంతి హిల్స్ కాలనీవాసుల, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.