- శేరిలింగంపల్లిలో కాషాయ జెండా ఎగరాలని యువత కు రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ సాయి నగర్ లో బిజెపి పార్టీ నాయకుడు లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక యువత రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశిస్తూ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశం కోసం పార్టీ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన అధ్వానంగా మారిందని, కంచె చేను మేసింది అన్నట్లుగా పరిపాలకులే అడ్డగోలుగా ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తూ అభివృద్ధిని కుంటుపరిచారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు యువత నడుము బిగించాలని సందేశం ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో సచిన్ గౌడ, మహేష్ రెడ్డి, అభిషేక్, కిరణ్ సాయి యాదవ్ బిజెపి పార్టీ నాయకులు ఎల్లేష్ , టర్బో శ్రీనివాస్, అశోక్, రవి ముదిరాజ్ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.