నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ హకీ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో అన్ని ఉమ్మడి జిల్లాల హకీ అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్ర హకీ క్రీడ అబివృద్దితోపాటు క్రీడాకారులకు మరిన్ని సదుపాయాలు, హకీ ప్రమాణాలు పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో హక ప్రాదాన్యత పెంచాలని హకీ అంతర్జాతీయ క్రీడాకారుడు , తెలంగాణ హకీ సెక్రటరీ ముఖేశ్ తెలిపారు.
తమ అసోసియేషన్ చైర్మెన్ గా 2 సంవత్సారాలు పదవి కాలం పూర్తి చేసుకోవడం, పదవి కాలంలో హకీ అభివృద్ధి కృషి చేయడం పట్ల విజయ ను అభినందించారు. తెలంగాణ హకీ చైర్మెన్ గా రెండవ సారి కొండ విజయ్ కొనసాగడానికి సర్వ సభ్య సమావేశంలో కమిటి సభ్యులు తీర్మానం చేశారు. తనకు అవకాశం రావడం పట్ల కొండ విజయ్ సంతోషం వ్యక్తం చేస్తూ, జాతీయ క్రీడ అయిన హకీ కి సేవ చేయడం కోసం మరొ సారి అవకాశం కల్పించినందుకు కమిటికి ధన్యవాదాలు తెలిపారు.