నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని టి ఎన్ నగర్, వీడియో కాలనీ, ఎఫ్ సి ఐ కాలనీలలో పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు.
ఈ సంధర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, టి ఎన్ నగర్, వీడియో కాలనీ, ఎఫ్ సి ఐ కాలనీలలో మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు, సాగుతున్నామని, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని సమస్యలను పరిశీలించా మని తెలిపారు. కాలనీలలో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, డివిజన్ పరిధిలోని కాలనీల ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజి, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ సహకారంతో డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల కృషి చేస్తామని శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి, వర్క్ ఇన్ స్పెక్టర్ నవీన్, స్థానికులు సుప్రజ, చంద్ర కళ, రమేష్, జగన్, వెంకటేశ్వరరావు, అంజయ్య, సరోత్తమరెడ్డి, శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి , ప్రభాకరరెడ్డి, ఇస్మియిల్, శంకర్ పాల్గొన్నారు.