- అధ్యక్షుడిగా ముద్దంగుల తిరుపతి, జాతీయ ప్రచార కార్యదర్శిగా మంజలి మారయ్య
నమస్తే శేరిలింగంపల్లి : జాతీయ అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్ , జాతీయ మహిళా అధ్యక్షురాలు వేముల తిరుమల దేవి, జాతీయ ప్రదాన కార్యదర్శి గుంజా శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్రీయ అధ్యక్షుడు ఎత్తరి మారయ్య, తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీమంజలి హనుమయ్య ఆధ్వర్యంలో నూతనంగా శేరిలింగంపల్లి నియోజికవర్గం వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ముద్దంగుల తిరుపతి ఎన్నుకున్నారు. జాతీయ ప్రచార కార్యదర్శిగా మంజలి మారయ్య ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పీట్ల వెంకయ్య, పరమేష్, ఎ.వెంకటేష్, మారయ్య, చందు, తిమ్మయ్య, గురువయ్య పాల్గొన్నారు.