- సైద్దాoతికతో నిబద్దతతో పని చేసి పార్టీని తిరుగులేని శక్తిగా తయారుచేద్దాం
- ప్రతి బూతుకు బూత్ కమిటీలను నిర్మించుకుందాం
- రాబోయే ఎన్నికలలో శేరిలింగంపల్లి నియోజికవర్గంలో బీజేపీ జెండా ఎగురవేద్దాం.
- చందానగర్ డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తల కు పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: సైద్ధాంతిక నిబద్ధతతో పనిచేసి సంస్థాగతంగా పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేసుకుందామని బిజెపి రాష్ట్రనేత కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ బిజెపి సమావేశం అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి అధ్యక్షతన దీప్తిశ్రీనగర్ లో జరిగింది. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కర్లపూడి రాఘవేంద్రరావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్, మాజీ కార్పోరేటర్ బొబ్బ నవతారెడ్డి మాట్లాడుతూ… బిజెపికి ఒక ప్రత్యేకత ఉందని, ప్రపంచంలోనే అతి పెద్ద సభ్యత్వం కలిగిన పార్టీగా, జనహృదయాలను చూరగొనాల్సిన బాద్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు. చందానగర్ డివిజన్ లో పార్టీని తిరుగులేని శక్తిగా తయారుచేసుకుందామని వారు అన్నారు. బిజెపి సిద్ధాంత బలం కలదని, ఇతర పార్టీలు కుటుంబ పార్టీలని వారు విమర్శించారు. పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టం చేసుకోవాల్సిన కర్తవ్యం ప్రతి కార్యకర్త పై ఉందని, చందానగర్ డివిజన్ లో తొందరలో ప్రతి బూత్ కు సుమారు 20 మంది చొప్పున బూత్ కమిటీలను నియమించి, పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు నూనె సురేందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాకేశ్ దూబే, అశోక్ వర్మ, పి. శ్రీనివాస్ గుప్త, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శులు శివకుమార్ వర్మ, శ్రీనివాస్ ముదిరాజ్, డివిజన్ కోశాధికారి వనమా శ్రీనివాస్ గుప్త, గుండె గణేష్ ముదిరాజ్, లలిత, పోచయ్య, అనంత రెడ్డి, నర్సింహారెడ్డి, మైనార్టీమోర్చా నాయకులు సైఫుల్లాఖాన్, గౌస్, నిశాంత్, శోభాదూబే, రమణ కుమారి, రాధిక, నిసత్, శ్రీకాంత్ యాదవ్, రవికాంత్, జనార్దన్ మూర్తి, విజయ్ గౌడ్, జగదీష్, సునీత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.