నమస్తే శేరిలింగంపల్లి: ఎమ్మెల్యే గాంధీ సహకారంతో కోట్ల రూపాయల వ్యయంతో కొండాపూర్ డివిజన్ లో శర వేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్
తెలిపారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని హనీఫ్ కాలనీలో రూ. 50 లక్షలు అంచనా వ్యయంతోనూ, మార్తాండ్ నగర్ లో రూ. 40 లక్షలు అంచనా వ్యయంతోనూ జరుగుతున్న సీసీ రోడ్లు (అంతర్గత రోడ్లు) పనులను స్థానిక నాయకులు, ప్రజలతో కలసి పర్యవేక్షించారు.
అనంతరం స్థానికంగా నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు తెలుసుకోవటం గురించి HMWS కొండాపూర్ వాటర్ మేనేజర్ సందీప్ , స్థానిక నాయకులతో కలిసి బస్తీలలో పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు, ఎమ్మెల్యే గాంధీ సహకారంతో కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్నో అభివృద్ధి పనులు చేయిస్తున్నామన్నారు. HMWS కొండాపూర్ వాటర్ మేనేజర్ సందీప్, జీహెచ్ఎంసి ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ వర్క్ ఇన్ స్పెక్టర్ రవి కుమార్, తెరాస నాయకులు మహమ్మద్ అలీ, అఫ్రోజ్ సమద్, జాఫర్, ఎండి నవీద్, మొహ్మద్ మోసిన్, మతిన్, అష్రాఫ్, మొబషీర్ పాల్గొన్నారు.