నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ మసీద్ బండ వడ్డెర బస్తి ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేదలకు సత్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి చేశారు. చలికాలం దృష్టిలో పెట్టుకొని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ఆదేశాలతో సత్యనారాయణ సేవా సమితి తరపున ఆ బస్తీ ప్రజలకి దుప్పట్లు పంపిణీ చేసినట్టు బిజెపి సీనియర్ నాయకుడు, సత్యనారాయణ సేవాసమితి చైర్మన్ అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని నిరుపేదల అభ్యున్నతి కోసం సత్యనారాయణ సేవా సమితి తోచిన సహకారం అందిస్తూనే ఉంటుందని తెలిపారు.