నమస్తే శేరిలింగంపల్లి : రంగారెడ్డి జిల్లా ఆర్య వైశ్య మహాసభ 5వ కార్యవర్గ సమావేశాన్ని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లిలో అభినవ్ బంకేట్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు, ఇండస్ట్రీస్ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ రేణుగుంట్ల గణేష్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ పొలిటికల్ చైర్మన్ చింతల రవి కుమార్ గుప్తాతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం నిర్వాహకులు ప్రభుత్వ విప్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఆర్య వైశ్య సంఘం మహా సభలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని , ఆర్య వైశ్య సంఘం సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని , ఎల్లవేళలా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు మల్లేష్ గుప్తా, అక్బర్ ఖాన్, నరేందర్ బల్లా , నటరాజ్, అధ్యక్షులు తాడేపల్లి వెంకటేశం గుప్త, ప్రధాన కార్యదర్శి గందే సురేష్ గుప్త, కోశాధికారి బిల్ల కంటి కిరణ్ కుమార్ గుప్త, శేరిలింగంపల్లి మండల ఆర్య వైశ్య సంగం అధ్యక్షుడు గంప సత్యనారాయణ గుప్త, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల పి ఎస్ టి లు, శేరిలింగంపల్లి బస్తి సంఘాలు పాల్గొన్నారు.







