నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని విద్యానగర్ లో అమెరికన్ లేసర్ ఐ హాస్పిటల్ ను కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి , రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మన ప్రాంతంలో అన్ని హంగులతో సకల సౌకర్యాలతో కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనియమని, ఇక్కడి ప్రాంత వాసులకి ఎంతగానో ఉపయోగపడుతుందని ,పేదలకు, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారికి సరసమైన ధరలకు నాణ్యమైన వైద్యం అందించాలని తెలిపారు. నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని హాస్పిటల్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దుర్గం వీరేశం గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు పారునంది శ్రీకాంత్, హరీష్ రెడ్డి, అక్బర్ ఖాన్, నరేంద్ర బల్లా, యశ్వంత్,అమిత్ గోపాల్ యాదవ్ , డాక్టర్ ఎం. సంథిరాముడు చైర్మన్ ఎస్.ఆర్.ఎం.సి&జి.హెచ్, డాక్టర్ రవిబాబు మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ మాధవి లత వైస్ చైర్మన్, ఎం. రఘురాం, ఎం. పార్థసారథి, ఆస్పత్రి సిబ్బంది, స్థానిక వాసులు పాల్గొన్నారు.