మసీద్‌బండలో డ్రైనేజ్ సమస్యలపై అరికెపూడి గాంధీ సమీక్ష

శేరిలింగంప‌ల్లి, జూన్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మసీద్‌బండ డివిజన్‌లో నెలకొన్న డ్రైనేజ్ సమస్యల పరిష్కారంపై నియోజకవర్గ శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ సంబంధిత అధికారులతో క‌లిసి చర్చలు నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా అవసరమైన చర్యలపై సమీక్షించారు. అనంతరం శిల్పా వ్యాలీ ప్రాంతంలోని డ్రైనేజ్ పైప్‌లైన్ వ్యవస్థ పనితీరు, నిర్వహణ, అభివృద్ధి అవసరాలపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రాంతంలో డ్రైనేజ్ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here