నమస్తే శేరిలింగంపల్లి: దళితబంధు పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచిందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పకు చెందిన భాగ్యలక్ష్మీకి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన టెంట్ హౌజ్ యూనిట్ ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా రూ. 10 లక్షల విలువ చేసే యూనిట్లను అందజేయడంతో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప వార్డు మెంబర్ శ్రీకళ, నాయకులు బసవయ్య, గోవింద్ చారి, బసవరాజ్ లింగాయత్, గోపాల్ యాదవ్, పట్లోళ్ల నరసింహారెడ్డి, విక్రమ్ యాదవ్, సౌజన్య, దళిత బంధు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.