మాదాపూర్ పట్టణ ప్రగతి లో ప్రభుత్వ విప్ గాంధీ, జడ్ సీ శంకరయ్య, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: పట్టణాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ సుధాంష్, స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి బస్తీ, కాలనీలలో ఉన్న చెత్తను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలిగిస్తున్నట్లు చెప్పారు. రాబోయే వర్షాకాలంలో ఎలాంటి రోగాలు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మాదాపూర్ డివిజన్ పట్టణ ప్రగతిలో సమస్యలపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే గాంధీ, జడ్ సీ శంకరయ్య

హరిత తెలంగాణ లో భాగంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా, విరివిగా మొక్కలు నాటాలని, మొక్కలు నాటడం మనందరి సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, డీఈ స్రవంతి, ఏఈ ప్రశాంత్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, ఏఎంఓహెచ్ డాక్టర్ కార్తీక్, వాటర్ వర్క్స్ శ్రీమన్నారాయణ, మేనేజర్ నివర్తి, స్ట్రీట్ లైట్ ఏఈ రాంమోహన్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ సాంబశివ రావు, నాయకులు గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్, ఏకే బాలరాజు యాదవ్, బృందారావు, మైనారిటీ అధ్యక్షులు రహిం, ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు మునాఫ్ ఖాన్, కృష్ణ కాలనీ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షులు ముక్తార్, మైనారిటీ నాయకులు బాబుమియా, లియాకత్, ఖాసీం, సలీం, మనికప్పా, మియన్ పటేల్, రహ్మాన్, రాములు యాదవ్, బుజంగం,అంకా రావు, సత్యనారాయణ, నర్సింహ, రామకృష్ణ, గౌస్, యూత్ నాయకులు షేక్ ఖాజా, మహమ్మద్ ఖాజా, మహమ్మద్, రవి, మిరాజ్, శానిటేషన్ సిబ్బంది, ఎంటమాలజీ సిబంది తదితరులు పాల్గొన్నారు.

మురికి కాలువలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here