శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ఆడపడుచులకు ఆత్మాభిమానం పెంపొందించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఏటా బతుకమ్మ చీరలను అందజేయడం జరుగుతుందని, ప్రతి అవ్వ కళ్లలో ఆనంద బాష్పాలు చూస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ కమ్యూనిటీ హాల్ లో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల రక్షణ, అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ ఫలాలను అందజేస్తున్నారన్నారు. ప్రతి పండగకు కేసీఆర్ పంపించే కొత్త బట్టల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
సురభి కాలనీలో…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభికాలనీ ఆంగ్ల మాద్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శనివారం మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రతి సంవత్సరం తెలంగాణ ఆడపడచులకు బతుకమ్మ చీరలను అందజేయడం ఆనవాయితీ గా మారిందన్నారు. కేసీఆర్ పంపించిన బతుకమ్మ చీరలను కట్టుకుని బతుకమ్మ ఆడతామని చీరలు అందుకున్న మహిళలు, వృద్ధులు చెప్పడం జరుగుతుందన్నారు. ప్రతి పండగకు తారతమ్యం లేకుండా కేసీఆర్ ప్రభుత్వం కొత్త బట్టలను అందజేయడం పట్ల ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, నాయకులు చంద్రకళ, రజిని, జ్యోతి, సౌజన్య, భాగ్యలక్ష్మీ, జయమ్మ, రోజా, కుమారి, కళ్యాణి, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.