తెలంగాణ ఆడబిడ్డలకు పెద్దన్నగా కేసీఆర్ చ‌రిత్ర‌లో నిలిచి పోతారు: బొబ్బ న‌వ‌తారెడ్డి

వేముకుంట మ‌హిళా భ‌వ‌నం వ‌ద్ద బ‌తుక‌మ్మచీర‌లు పంపిణీ చేస్తున్న కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తారెడ్డి

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌ందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని వేముకుంట మహిళ భవనం, పీజేఆర్ స్టేడియం లో స్థానిక మ‌హిళ‌ల‌కు కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌త‌రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో బాగంగా రెండవ రోజున వేముకుంట‌, పీజేఆర్ స్టేడియం ల‌లో చీర‌ల‌ను పంపిణీ చేసిన‌ట్టు తెలిపారు. తెలంగాణా ఆడబిడ్డలు ఆరాదించి, అభిమానించే పండుగ బతుకమ్మ పండుగ అని, ప్రపంచమంతా కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నా పేదలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకాన్ని ఆపడం లేద‌న్నారు. ప్రజల గురించి ఇంత గొప్పగా ఆలోచించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఆడబిడ్డలకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ చ‌రిత్ర‌లో నిలిచి పోతారన్నారు.
బ‌తుక‌మ్మ చీర‌తో ఆక‌ట్టుకున్న కార్పొరేట‌ర్…
కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తారెడ్డి బ‌తుక‌మ్మ చీర క‌ట్టుకున్నారు. ప్ర‌భుత్వం అంద‌జేసిన చీర‌ల గొప్ప‌ద‌నం, నాణ్య‌త‌ను వివ‌రించేలా స్వ‌యంగా బ‌తుక‌మ్మ చీర‌తో ఆక‌ట్టుకున్నారు. ఆమెతో పాటు డివిజ‌న్ టీఆర్ఎస్ అధ్య‌క్షురాలు వెన్నంరెడ్డి రాధిక‌, వార్డు మెంబ‌ర్ ర‌మ‌ణ‌కుమారిలు సైతం బ‌తుక‌మ్మ చీర‌ల‌తో సంద‌డి చేశారు.

బతుకమ్మ చీరలతో ఆక‌ట్టుకుంటున్న చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు వెన్నంరెడ్డి రాధిక, వార్డ్ మెంబెర్ రమణ‌కుమారి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here