ఆల్విన్ కాలనీ లో ఉత్సాహంగా పట్టభద్రుల ఓటరు నమోదు

ఆల్విన్ కాలనీ లో నమోదు చేసిన పట్టభద్రుల ఓటరు నమోదు వివరాలను ప్రభుత్వ విప్ గాంధీకి అందజేస్తున్న కార్పొరేటర్ దొడ్డి వెంకటేష్ గౌడ్, శిరీష

ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ లో టిఆర్ఎస్ మహిళా నాయకురాలు శిరీష ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ఉత్సాహంగా నిర్వహించారు. ఈ క్రమంలో సేకరించిన వంద మంది పట్టభద్రుల ఓటరు నమోదు వివరాలను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి శిరీష శనివారం ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ కి అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ ఆమెను అభినందించారు. శిరీష మాదిరిగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టభద్రులు అందరిని ఓటరు నమోదు వైపు నడిపించాలని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here