శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ పరిధిలోని శిల్ప గార్డెన్ లో శనివారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. నూతనంగా ఏర్పడుతున్న కాలనీలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్పందిస్తూ రోడ్లు, యూజీడీ లైన్లు, మంచినీటి సరఫరా వంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. త్వరలో సంబంధిత అధికారులను తీసుకువచ్చి దశల వారీగా సమస్యలను పరిష్కరించి అభివృద్ధి దిశగా పాటుపడతామని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీ అభివృద్ధి అంశాలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఓటరుగా ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్ప గార్డెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు, కార్యదర్శి రాంకిశోర్ యాదవ్, ఉపాధ్యక్షులు అభినవ్, కోశాధికారి నరేంద్ర, కాలనీ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.